![]() |
![]() |
.jpg)
విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా చేశారు. వరుణ్ తేజ్ తో కలిసి వెంకీ 'ఎఫ్ 2' చేశారు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి 'ఆర్ఆర్ఆర్' సినిమా చేస్తున్నారు. అసలు సిసలైన మల్టీస్టారర్ ఇది. నందమూరి, మెగా (కొణిదెల) అభిమానుల మధ్య ఒక విధమైన ఘర్షణ వాతావరణం ఉంటుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి కూడా అదే మాట చెప్పారు. ఈ సినిమా వల్ల మనుషుల మధ్య స్నేహపూరిత, సోదర వాతావరణం ఏర్పడుతుందని మెగాస్టార్ చిరంజీవి చెబుతున్నారు.
"ఇద్దరు స్టార్ హీరోల సోదరుల మెలిగితే వాళ్ళ మధ్య ఎటువంటి వాతావరణమే ఏర్పడుతుంది. నా ఆలోచనలకు తగ్గట్టు రామ్ చరణ్ నడుచుకుంటున్నాడు. ఇప్పటి హీరోలు స్టార్ డమ్ ను సినిమాల వరకు పరిమితం చేసి బయట స్నేహితుల్లా ఉంటున్నారు" అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తన తోటి స్టార్లతో ఎందుకు సినిమాలు చేయలేకపోయారని ఆయన్ని అడగ్గా "కథలు దొరక్క తప్ప మరే కారణం లేదు కథలు దొరికితే ఎవరు మాత్రం చేయరు" అని సమాధానం ఇచ్చారు. ఎన్టీఆర్ - ఏఎన్నార్, కృష్ణ - కృష్ణంరాజు మల్టీస్టారర్స్ చేశారని... ఏఎన్ఆర్, కృష్ణ, చంద్రమోహన్ తో కలిసి తాను నటించిననీ, ఈరోజు కలిసి నటించడం కొత్తగా వచ్చింది ఏమి కాదని మెగాస్టార్ తెలిపారు.
![]() |
![]() |